నితిన్- త్రివిక్రమ్ సినిమాకి క్రేజీ సినిమాటోగ్రాఫర్

నితిన్- త్రివిక్రమ్ సినిమాకి క్రేజీ సినిమాటోగ్రాఫర్

Published on Aug 29, 2015 3:35 PM IST

trivikram-and-cineautograph
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది ‘S/O సత్యమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ త్వరలోనే యంగ్ హీరో నితిన్ తో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా జరుగుతోంది. ముందుగా ఈ సినిమా కోసం మణిరత్నం దగ్గర పనిచేసిన రాజీవ్ మీనన్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకోవాలని అనుకున్నారు కానీ తాజాగా ఆ అవకాశం వేరొకరికి దక్కింది. తమిళంతో పాటు హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన నటరాజన్ సుబ్రమనియంని త్రివిక్రమ్ – నితిన్ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ఎన్నికయ్యాడు.

నటరాజన్ కెరీర్ ని సినిమాటోగ్రాఫర్ గా ప్రారంభించి, ఈ మధ్య తమిళంలో హిట్ అయిన ‘శతురంగ వెట్టై’ సినిమాతో హీరోగా కూడా మారాడు. నటరాజన్ గతంలో ‘జబ్ వియ్ మెట్’, ‘గోల్ మాల్ రిటర్న్స్’, ‘లవ్ ఆజ్ కల్’, ‘రాంజానా’ లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. అలాగే త్వరలో రిలీజ్ కానున్న విజయ్ ‘పులి’ సినిమాకి కూడా తనే సినిమాటోగ్రాఫర్. అలాంటి స్టార్ ఇమేజ్ ఉన్న సినిమాటోగ్రాఫర్ ని త్రివిక్రమ్ సెలక్ట్ చేసుకున్నాడు. నటరాజన్ కి ఇది తొలి తెలుగు సినిమా కానుండడం విశేషం. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సమంతని ఫైనలైజ్ చేయగా రెండవ హీరోయిన్ కోసం అన్వేషణ చేస్తున్నారు. అలాగే తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు