టాలెంటెడ్ యాక్టర్ కి పూరి డైరెక్షన్ సలహా.?

టాలెంటెడ్ యాక్టర్ కి పూరి డైరెక్షన్ సలహా.?

Published on Oct 6, 2015 4:21 PM IST

revathi

సీనియర్ నటి రేవతి గుర్తుందా.? అచ్చ తెలుగమ్మాయిలా ఉంటూ కళ్ళతోనే హావ భావాలను కలిగించగలిగిన రేవతికి నటిగా మంచి పేరుంది. 1990లలో ‘గాయం’, ‘రాత్రి’, ‘ప్రేమ’, ‘లంకేశ్వరుడు’ లాంటి సినిమాల్లో నటించిన రేవతి తెలుగులో ఇటీవలే అనుక్షణం సినిమాలో కనిపించింది. అలాగే త్వరలోనే వరుణ్ తేజ్ – పూరి ‘మా అమ్మ మహాలక్షి’ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

రేవతి నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా రెండు ఇంగ్లీష్ సినిమాలు, రెండు హిందీ సినిమాలు ఒక మలయాళం సినిమా చేసింది. ఇప్పుడు తెలుగులో ఆమెని ఓ సినిమా డైరెక్ట్ చెయ్యమని పూరి సలహా ఇచ్చాడట. ఆ విషయంలో రేవతి కూడా సముఖత చూపుతున్నట్లు సమాచారం. పూరి కి బాగా తెలిసిన వారు నిర్మాతలు కావడం వలన పూరి తనని డైరెక్ట్ చేయమని తెలిపాడట. రేవతి డైరెక్ట్ చేయబోయే సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు