రాజుగారి గది 2 కోసం భారీ స్థాయిలో ప్లానింగ్
Published on Jul 8, 2017 1:39 pm IST


నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో రాజుగారి గది 2 ఫై ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోగా భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ ఓ పాత్రలో మెరవనున్న విషయం ఇదివరకే తెలియజేశాము. ఈ చిత్రంలో సమంత కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

పివిపి సంస్థ నిర్మాణం లో వస్తున్న ఈచిత్ర ప్రమోషన్స్ ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో కూడా బ్రహ్మోత్సవం, క్షణం వంటి చిత్రాలకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేయడంతో మంచి హైప్ వచ్చింది. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అశ్విన్, వెన్నెల కిషోర్ మరియు ప్రవీణ్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

 
Like us on Facebook