‘ఐ’ సినిమాతో ఈ సంక్రాంతి శంకర్ రాత్రే – వర్మ

‘ఐ’ సినిమాతో ఈ సంక్రాంతి శంకర్ రాత్రే – వర్మ

Published on Dec 27, 2014 9:17 PM IST

varma-i
‘ఇప్పుడే శంకర్ ‘ఐ’ సినిమా ట్రైలర్ చూశాను. ఈ సంక్రాంతి శంకర్ రాత్రి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం మొద్దులు మాత్రమే తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తారు. తమిళనాడులో రజినీకాంత్, జయలలిత కంటే శంకర్ చాలా గొప్పవాడు’ అంటూ ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం సాయంత్రం తమిళ దర్శకుడు శంకర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. భారి నిర్మాణ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ సినిమా ట్రైలర్లను కొంచం లేటుగా చూసిన వర్మ సోషల్ మీడియాలో సినిమాపై ఓ రేంజ్లో భజన చేశారు.

ఒకవేళ శంకర్ గనుక అమీర్ ఖాన్ తో సినిమా తీస్తే అది ఇండియన్ ‘అవతార్’ అవుతుంది. రజినీకాంత్ వీరాభిమాని అయిన నేను ఇప్పుడు శంకర్ అభిమానిగా మారిపోయా. హిందీలో షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ ల స్టార్ ఇమేజ్ పై దర్శకులు ఆధారపడుతుంటే, ఇక్కడ శంకర్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోల ఇమేజ్ ను నాశనం చేస్తున్నాడు. నా జోస్యం నిజమైతే ‘ఐ’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ‘లింగ’ సినిమా కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తాయి. అంటూ వర్మ పేర్కొన్నారు.

విక్రమ్, అమీ జాక్సన్ జంటగా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏఅర్ రెహమాన్ స్వరపరిచిన తెలుగు బాణీలను డిసెంబర్ 30వ తేదిన విడుదల చేస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు