సీనియర్ పొలిటీషియన్ కి సవాల్ విసిరిన వర్మ !

సీనియర్ పొలిటీషియన్ కి సవాల్ విసిరిన వర్మ !

Published on Aug 24, 2017 3:30 PM IST


రేపు విడుదలకానున్న ‘అర్జున్ రెడ్డి’ చిత్రం యొక్క పోస్టర్ల వివాదంలో తలదూర్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీనియర్ పొలిటీషియన్ వి.హనుమంతరావు పై తనదాయెను శైలిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆ వ్యాఖ్యలకు విహెచ్ లేదా అయాన్ వర్గీయులు స్పందించారో ఏమో తెలీదు కానీ వర్మ మరోసారి సోషల్ మీడియాలో విహెచ్ పై చురకలు విసిరారు.

వర్మ మాట్లాడుతూ ‘విహెచ్ గారు అర్జున్ రెడ్డి నిర్మాతలు మీకు పబ్లిసిటీ కోసం డబ్బులు ఇచ్చినట్టున్నారు. సంబంధిత అధికారుల్ని ఈ విషయంపై విచారించాల్సిందిగా కోరుతున్నాను’ అని వ్యంగ్యంగా అంటూ ‘హనుమంతరావుగారు నన్ను హైదరాబాద్లో అడుగుపెట్టకుండా చేయడంకాదు మీ మనవళ్ల వయసున్నవాళ్లను రేపు అర్జున్ రెడ్డి థియేటర్లోకి వెళ్లకుండా చూడండి. రేపు ఐమాక్స్ లో పదిన్నర షో చూడటానికి వస్తాను. అక్కడ చూసుకుందాం. బస్తీ మే సవాల్’ అంటూ ఛాలెంజ్ కూడా చేశారు. మరి దీనికి విహెచ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు