దేవుడి వివాదంలో చిక్కుకున్న వర్మ !
Published on Jun 28, 2017 1:22 pm IST


ఎప్పటికప్పుడు ఏదో వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలిచే వర్మ ట్విట్టర్ నుండి వైదొలగినప్పటి నుండి ఆయన కాస్త హడావుడి తగ్గింది. కానీ తాజాగా ఆయన్ను కొత్త వివాదం చుట్టుకుంది. ఎప్పుడో ఆయన వేసిన వివాదాస్పదమైన ట్వీట్లు ఇప్పుడు లీగల్ కేసులగా మారాయి. వివరాల్లోకి వెళితే వర్మ గతంలో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుడిపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.

అసలు తన తలనే కాపాడుకోలేనివాడు భక్తుల తలల్ని ఎలా రక్షిస్తాడు అనేది ఆ ట్వీట్ల సారాంశం. అప్పట్లో ఆ ట్వీట్లు పెద్ద దుమారంగా మారి వర్మపై విమర్శలు కురిశాయి. వాటికి స్పందించిన వర్మ అవి ఎవ్వర్నీ కావాలని బాధించడానికి చేసినవి కావని, ఒకవేళ భాదిస్తే క్షమించమని కూడా అడిగాడు. కానీ ముంబైకి చెందిన వివేక్ శెట్టి దేవుడ్ని అవమానించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అంథేరి కోర్టులో పిటిషన్ వేశారు.

ఆ కేసును విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వర్మను ఆగష్టు 8న ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేసింది.

 
Like us on Facebook