ఈసారి ‘జిఎస్టీ’ని ఔట్ డోర్లో తీస్తానంటున్న వర్మ !
Published on Feb 4, 2018 11:42 am IST

ఇటీవల రామ్ గోపాల్ వర్మ అడల్ట్ స్టార్ మియా మల్కొవాతో తీసిన ‘జిఎస్టీ’ ఎంతటి దుమారాన్ని రేపింది తెలిసిన సంగతే. ఎన్నో మహిళా సంఘాలు, ఇతరత్రా ప్రముఖులు వర్మ ఆడవాళ్ళ మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ ఆయనపై కేసులు పెట్టి తీవ్ర విమర్శలకు దిగి కేసులు కూడా పెట్టారు. వీటన్నిటికీ వెనక్కు తగ్గని వర్మ అందరికీ తనదైన స్టైల్లో సమాధానం చేబుతూ ‘జిఎస్టీ’ మీద ఇంకో వీడియో తీస్తానని ప్రకటించారు.

అది కూడా గత వీడియో కంటే ఎక్కువ క్లారిటీగా, బిన్నంగా ఉండేలా ఉంటుందని, ఈసారి ఇండోర్ లొకేషన్లో కాకుండా ఒక అందమైన ఐలాండ్ ఔట్ డోర్ లొకేషన్లో చిత్రీకరిస్తానని అన్నారు. మరి వర్మ చేయబోయే ఈ వీడియో ఇంకెన్ని సంచలనాలకు తావిస్తుందో చూడాలి. ఇకపోతే ఎన్నో విమర్శలకు గురైన జిఎస్టీ ఆన్ లైన్లో మంచి ఆదరణను పొందిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook