అందరూ కావాలంటే వర్మ మాత్రం వద్దంటున్నాడు !

అందరూ కావాలంటే వర్మ మాత్రం వద్దంటున్నాడు !

Published on Jan 21, 2017 1:20 PM IST

rgv
రామ్ గోపాల్ వర్మ.. నిత్యం ఏదో ఒక అంశంలో సంచలనాలు సృష్టిస్తూ వార్తల్లో నిలిచే వ్యక్తి. ఈ మధ్య ‘ఖైదీ నెం 150’ విషయంలో చిరంజీవి కుటుంబంతో పెద్ద వివాదం జరిపిన వర్మ తాజాగా మరొక సున్నిత అంశంలో తన అభిప్రాయాలను వెల్లడించి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టు వివాదం గురించి నిన్న తెలుగు స్టార్ హీరోలు మహేష్, పవన్ లు మాట్లాడుతూ వారికి సపోర్ట్ చేసి అది సంస్కృతిలో భాగమని, దాన్ని బ్యాన్ చేయడం తగదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

అప్పటి వరకూ ఆ విషయం మీద స్పందించని వర్మ నిన్న సాయంత్రం ఉన్నట్టుండి ఏకధాటిగా ట్వీట్ల వర్షం కురిపించారు. జల్లికట్టు సాంప్రదాయం ద్వారా మూగ జీవాల్ని హింసించడం తగదని, ఆలా చేయడం టెర్రరిజంతో సమానమని, ఒకవేళ జంతువులకే గనుక ఓటు హక్కు, టికెట్లు కొనుక్కునే శక్తి ఉండి ఉంటే ప్రముఖులు ఎవరూ జల్లికట్టుకు సపోర్ట్ చేయరని, అసలు ముందుగా జల్లికట్టుకి సపోర్ట్ చేసే వాళ్ళనంతా ఎద్దుల చేత తరిమించి అప్పుడు సపోర్ట్ చేస్తారేమో అడగాలని తన వ్యతిరేకతను తీవ్రంగా తెలియజేశారు. దీంతో తమిళులు చాలా మంది ఆయనపై తన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు