మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేసిన వర్మ

మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేసిన వర్మ

Published on Aug 30, 2014 5:51 PM IST

RGV
రామ్ గోపాల్ వర్మ ప్రతి పండుగ మీద లేదా స్పెషల్ డేస్ మీద వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. తాజాగా వర్మ వినాయక చవితి సందర్భంగా వినాయకుడి మీద కామెంట్ చేసాడు.

‘తన తలనే కాపాడు కోలేకపోయినతను భక్తుల తలలను ఎలా కాపాడతాడు. మరియు దేవుడైన వినాయకుడికి అంతపెద్ద బొజ్జ ఎలా వచ్చింది (లంబోదరుడు), ఒకవేళ తన కోసం ఏనుగు తలని ఎతికి తెచ్చేలోపు అది జరిగిందా’ అని వర్మ ట్వీట్ చేసాడు.

ఇది పోస్ట్ చేసిన కొద్ది సేపటికి వర్మకి సోషల్ మీడియా లో పలువురి నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో వర్మ మళ్ళీ ‘నన్ను అడుగుతున్నా అందరూ ఏను గణేష్ గురించి అడిగిన ప్రతి ప్రశ్నని అర్థం చేసుకోండి. అవి నాకు తెలియకపోవడం మరియు దేవుడిని నమ్మకపోవడం వలన వచ్చిన అనుమానం’ అని పోస్ట్ చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు