తన అభిమాన నటుడితో వర్మ కొత్త సినిమా!

తన అభిమాన నటుడితో వర్మ కొత్త సినిమా!

Published on Aug 3, 2015 2:55 PM IST

rgv-and-suddep1
ట్విట్టర్‌లో తన వ్యాఖ్యలతో, సినిమాల్లో తాను ఎంచుకునే నేపథ్యాలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం డేంజరస్ క్రిమినల్ వీరప్పన్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో కన్నడ పరిశ్రమలోనూ తానేంటో నిరూపించే ప్రయత్నం చేస్తోన్న వర్మ, తెలుగు, హిందీల్లోనూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తనకు బాగా కలిసి వచ్చిన అండర్ వరల్డ్ నేపథ్యంలో వర్మ మరో సినిమా చేసేందుకు సిద్ధం కావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.

బెంగళూరు నేపథ్యంలో సాగే ఈ అండర్ వరల్డ్‌ సినిమాకు వర్మ అప్పుడే ‘అప్పా’ అనే పేరు ఖరారు చేశారు. ముత్తప్పా రాయ్ అనే బెంగళూరుకు చెందిన, గతంలో అండర్ వరల్డ్ డాన్‌గా పేరుమోసిన వ్యక్తిని ఈ మధ్యే కలిసిన వర్మ, ఆయన జీవిత కథ ఆధారంగా అప్పాను తెరకెక్కించనున్నారట. ఈ సినిమాకు తన అభిమాన నటుడైన సుధీప్‌ను హీరోగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సుధీప్ కూడా ఈ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇక కన్నడలో స్టార్ హీరో అయిన సుధీప్, ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించారు. వర్మ తన స్టైల్లోనే తెరకెక్కించనున్న ఈ అండర్ వరల్డ్ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు