తెలుగు సినిమాలకు స్వస్తి చెప్పిన వర్మ?

తెలుగు సినిమాలకు స్వస్తి చెప్పిన వర్మ?

Published on Feb 10, 2016 3:27 PM IST

rgv1
అప్పటి వరకూ ఒకలా వెళ్తున్న టాలీవుడ్ సినిమా ఫార్మాట్ ని ‘శివ’ అనే సినిమాతో మార్చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత వర్మ నుంచి ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఒక స్టేజ్ లో తెలుగు నుంచి వెళ్ళిపోయి హిందీలో స్థిరపడి అక్కడ కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలతో తన సత్తా చాటుకున్నాడు. మళ్ళీ గత కొద్ది సంవత్సరాలుగా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో వర్మ సక్సెస్ అనేదానికి చాలా దూరంగా ఉన్నాడు, కానీ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

రియల్ లైఫ్ స్టోరీస్ ని ఇష్టపడే వర్మ రీసెంట్ గా వంగవీటి రాధా జీవిత ఆధారంగా ‘వంగవీటి’ అనే సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు. కానీ ఈ సినిమా చేయద్దు ఆపేయమని తనకి చాలా మంది నుంచి వార్నింగ్ కూడా వస్తోంది. అయినప్పటికీ ఆ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు, అలాగే వర్మ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అదే వంగవీటి సినిమా తర్వాత ఇక నేను తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్మ ఇలా చెప్పడం ఇది మొదటిసారేం కాదు. గోవింద గోవింద టైములో కూడా అలా చెప్పే బాలీవుడ్ కి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడెందుకు తెలుగు సినిమాలకి స్వస్తి చెప్పాలనే నిర్ణయం తీసుకున్నాడు అనేదానిపై క్లారిటీ లేదు.

వర్మ చేస్తున్న వంగవీటి కాకుండా ‘పట్ట పగలు’, ‘ఎటాక్’, ‘శ్రీదేవి’, ‘మొగలి పువ్వు’ లాంటి సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు