నాగార్జున ‘శివ’పై డాక్యుమెంటరీ తీసిన రామ్ గోపాల్ వర్మ.

నాగార్జున ‘శివ’పై డాక్యుమెంటరీ తీసిన రామ్ గోపాల్ వర్మ.

Published on Sep 23, 2014 4:42 PM IST

Shiva-in-3D
నాగార్జున హీరోగా నటించిన ‘శివ’ సినిమా 1989, అక్టోబర్ 5న విడుదలయింది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు రామ్ గోపాల్ వర్మ. తన తొలిచిత్రంతోనే తెలుగుతెరపై ఒక సంచలనం సృష్టించారు. ఈ చిత్రం తెలుగు సినిమా గతిని, పరిస్థితి, దర్శకనిర్మాతల ఆలోచన విధానాన్ని మార్చింది. తొలిచిత్రంతో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రెండు నందులను కైవశం చేసుకుని చరిత్ర సృష్టించారు వర్మ. ఇప్పుడు ఈ చిత్రంపై వర్మ ఓ డాక్యుమెంటరీని రూపొందించారు.

యాక్షన్ సినిమాలకు కొత్త వరవడిని సృష్టించిన ఈ క్లాసిక్ విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ‘శివ’పై వర్మ డాక్యుమెంటరీ రూపొందించడం విశేషం. ఆ డాక్యుమెంటరీని ‘శివ’ విడుదలైన అక్టోబర్ 5న విడుదల చేస్తున్న వర్మ ట్విట్టర్ లో వెల్లడించారు. అప్పట్లో ఈ చిత్రం విజయం సాదించడంలో ఇళయరాజా సంగీతం, నాగార్జున నటన, వర్మ దర్శకత్వ ప్రతిభ తోడయ్యాయి.

‘శివ’ చిత్రం డాక్యుమెంటరీ ట్రైలర్ :

సంబంధిత సమాచారం

తాజా వార్తలు