రీ షూట్ చేసే పనిలో రామ్ గోపాల్ వర్మ !

రీ షూట్ చేసే పనిలో రామ్ గోపాల్ వర్మ !

Published on Apr 23, 2017 5:07 PM IST


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సర్కార్ 3’. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. అయితే చాలా రోజుల క్రితమే షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ముందుగా మార్చి 17న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ దాన్ని కాస్త ఏప్రిల్ 7 వర్మ పుట్టినరోజుకి వాయిదా వేశారు. ఆ రోజు కూడా సినిమా వాయిదాపడింది.

దీని వెనకున్న అసలు కారణం కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని, వాటి పట్ల అసంతృప్తిగా ఉన్న వర్మ చాలా డిస్కషన్ల తర్వాత వాటిని రీ షూట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఆ తతంగమే నడుస్తోంది. అమితాబ్ పై కొన్ని సన్నివేశాలను ఇంకాస్త బెటర్ గా మళ్ళీ షూట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ నిన్న సాయంత్రం తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మరి ఈ రీ షూట్ పూర్తై, సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు