వంగవీటి ట్రైలర్ : వర్మ మార్క్ క్రైమ్ డ్రామా!
Published on Oct 2, 2016 5:28 pm IST

vangaveeti
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ పేరుతో మరో సంచలనాత్మక సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. రియల్ లైఫ్ కథలను, క్రైమ్ డ్రామాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడని పేరు తెచ్చుకున్న వర్మ, తన పంథాలో వంగవీటి రాధా, ఆయన తమ్ముడు వంగవీటి రంగాల చరిత్రను ‘వంగవీటి’ అన్న టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. విజయవాడ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వంగవీటి రాధా ఒక శక్తిగా ఎదిగే క్రమంతో మొదలయ్యే వంగవీటి సినిమా కథ, ఆయన తమ్ముడు వంగవీటి రంగా హత్యతో ముగుస్తుందని వర్మ తెలిపారు.

ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. గతంలో ఇలాంటి నేపథ్యంలోనే నడిచే రక్తచరిత్రతో ఈతరం ప్రేక్షకులకు తన స్థాయేంటో పరిచయం చేసుకున్న వర్మ, సరిగ్గా అదే తరహాలో ఈ క్రైమ్ డ్రామాను కూడా తన స్థాయికి తగ్గట్టుగా తెరకెక్కించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. పర్ఫెక్ట్ క్యాస్టింగ్‌తో వర్మ మరోసారి మాయ చేయబోతున్నారని, ఈ సినిమా కూడా రక్తచరిత్ర తరహాలో మెప్పిస్తుందని ఇప్పట్నుంచే ప్రచారం మొదలైంది. సందీప్, వంశీ ఛాగంటి, కౌటిల్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు.

వంగవీటి ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
Like us on Facebook