ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : కళ్యాణ్ రామ్ – భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : కళ్యాణ్ రామ్ – భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను !

Published on Mar 22, 2018 6:41 PM IST

కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొంది రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘ఎంఎల్ఎ’. ఈ విడుదల సందర్భంగా కళ్యాణ్ రామ్ తో మేము జరిపిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ విశేషాలు..

ప్ర) ‘ఎం.ఎల్.ఏ’ సినిమాలో రాజకీయం ఎలా ఉండబోతోంది ?

జ)ఈ సినిమాలో రాజకీయం గురించి పెద్దగా ఉండదు. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం ఈ సినిమాలో ఉండబోతోంది. పొలిటికల్ టచ్ కొంతవరుకు ఉంటుంది అంతే తప్ప పెద్దగా ఉండదు.

ప్ర)ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పోసాని గారు మిమ్మల్ని ‘ఎం.ఎల్.ఏ’ గా చూడాలనుకుంటున్నాను అన్నారు.. దాని గురించి ?

జ)ఇప్పుడు నాకు అలాంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. మంచి చిత్రాల్లో నటిస్తున్నాను.

ప్ర)మీరు పాత్రల కోసం తరచూ బాడి లాంగ్వేజ్ మారుస్తారు ? కారణం ఏంటి ?

జ)డైరెక్టర్ వచ్చి నాకు పాత్ర వివిరించినప్పుడు ఆ రోల్ లో నేను ఎలా కనిపించాలో అలా తయారవుతాను. ‘ఇజం’ సినిమా కోసం యంగ్ లుక్ కావాలి సో సిక్స్ ప్యాక్ చేసి ఆ లుక్ లో కనిపించడం జరిగింది. ప్రతి సినిమాకి అంతే.

ప్ర) సినిమా ఒప్పుకోవాడానికి మీరు ముఖ్యంగా ఏం చూస్తారు ?

జ) కథ. నాకు కథే ముఖ్యం. డైరెక్టర్, బ్యానర్ కంటే స్టోరి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాను. నేను కథను నమ్మి తీసిన సినిమాలు కొన్ని ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు కాని ఎప్పటికీ నేను స్టోరికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను.

ప్ర) కాజల్ తో పనిచెయ్యడం గురించి ?

జ)మొదటి నుండి ఈ సినిమాలో పెద్ద హీరోయిన్ చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావించారు. అనుకోకుండా కాజల్ ఈ సినిమాకు ఎంపికయ్యింది. చాలా కాలం తరువాత మళ్లీ ఆమెతో వర్క్ చెయ్యడం హ్యాపీ గా అనిపించింది.

ప్ర) ప్రస్తుత రాజికీయలపై మీ స్పందన ఏమిటి ?

జ)నేను ఎలాంటి కామెంట్ చెయ్యదలుచుకోలేదు. ప్రస్తుతం నేను రెండు సినిమాలు ఒప్పుకున్న వాటితోనే బిజీగా గడుపుతున్నా.

ప్ర)భవిష్యత్తులో ఎలాంటి సినిమా చెయ్యాలని అనుకుంటున్నారు ?

జ)అన్ని రకాల పాత్రలు చెయ్యాలని ఉంది. మంచి కథా బలం ఉన్న సినిమా ఏదైనా చేస్తాను. ఎంటర్టైనింగ్ గా కథను చెప్పగలిగితే ఏ దర్శకుడితోనైనా సినిమా ఒప్పుకుంటాను.

ప్ర) ‘నా నువ్వే’ సినిమానుచెయ్యడానికి ప్రధాన కారణం ఏంటి ?

జ)డైరెక్టర్ జయేంద్ర ఈ కథ చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. ప్యూర్ లవ్ స్టోరితో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీలో నా లుక్ కొత్తగా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు