విదేశాల్లో ఆడిపాడనున్న నారా రోహిత్ !


2016వ సంవత్సరంలో వరుస సినిమాలతో సందడి చేసిన నారా రోహిత్ ఈ ఏడాది మాత్రం కాస్త స్పీడ్ తగ్గించి సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన నటించిన ‘శమంతకమణి’ విడుదలై విజయాన్ని అందుకోగా ప్రస్తుతం ‘కథలో రాజకుమారి, పండగలా దిగివచ్చాడు’ వంటి చిత్రాల్లో పాటు నూతన దర్శకుడు పవన్ మల్లెల డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు రోహిత్.

ఇప్పటి వరకు హైదరాబాద్లో షూటింగ్ చేసిన ఈ చిత్ర యూనిట్ తాజాగా పాటల చిత్రికరణ కోసం నార్వే వెళ్లారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం నారా రోహిత్ సుమారు 22 కిలోల బాగా బరువు తగ్గాడు. ఇకపోతే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను ఈ నెల 25న రోహిత్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ను కూడా నిర్ణయించారని, దాన్ని కూడా 25 నే రిలీజ్ చేస్తారట. శరచ్చంద్రిక మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో రోహిత్ కు జంటగా రెజినా కాసాండ్రా నటిస్తుండగా రమ్యకృష్ణ ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

 

Like us on Facebook