వాషింగ్టన్ వెళ్తున్న ‘రౌడీ ఫెలో’..!

వాషింగ్టన్ వెళ్తున్న ‘రౌడీ ఫెలో’..!

Published on Jul 24, 2014 5:44 PM IST

rowdy-filim
నారా రోహిత్, విశాక సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ‘రౌడీ ఫెలో’. గేయ రచయితగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న కృష్ణ చైతన్య ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకున్న ‘రౌడీ ఫెలో’ యూనిట్ పాటల చిత్రీకరణ కోసం వాష్టింగ్టన్(అమెరికా) వెళ్తున్నారు. అక్కడ అందమైన ప్రదేశాలలో సాంగ్స్ షూట్ చేయనున్నారు.

ఇటివలే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ నటించిన ‘భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను రీమిక్స్ చేశారు. సన్నీ సంగీతం అందించారు. మూవీమిల్స్ పతాకంపై ప్రకాష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రౌడీ ఫెలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ లు, వాటిలో నారా రోహిత్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు