ఈ శనివారం మాటీవీలో మోహన్ బాబు ‘రౌడీ’

ఈ శనివారం మాటీవీలో మోహన్ బాబు ‘రౌడీ’

Published on Jul 24, 2014 4:17 PM IST

rowdy11
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రౌడీ’. మంచు విష్ణు హీరోగా నటించగా జయసుధ, శాన్వి కీలక పాత్రలు పోషించారు. వెండితెర సందడి చేసిన ఈ చిత్రాన్ని బుల్లితెర ప్రేక్షకుల ఇంటికి తీసుకొస్తున్నారు మాటీవీ యాజమాన్యం. జూలై 27, శనివారం సాయంత్రం 6 గంటలకు మాటీవీలో ‘రౌడీ’ సినిమాను ప్రసారం చేస్తున్నారు.

రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నిర్మితమైన ‘రౌడీ’లో మోహన్ బాబు పెర్ఫార్మన్స్ హైలైట్. మంచు విష్ణు కూడా అద్బుతంగా నటించారు. వర్మ దర్శకత్వం, గంగోత్రి విశ్వనాద్ అందించిన మాటలు సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు