‘ధృవ’ సినిమా విడుదలయ్యాక తన సినిమాను అనౌన్స్ చేస్తానన్న దర్శకుడు !

rp-patnayak
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలోని దర్శకుల్లో ఒకరు రామ్ చరణ్ నటిస్తున్న ‘ధృవ’ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా చూశాకే తన తరువాతి సినిమా ఏమిటో అనౌన్స్ చేస్తానని అంటున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా.. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, నటుడు, దర్శకుడు అయిన ఆర్పీ పట్నాయక్. ప్రస్తుతం ఈయన స్వీయ దర్శకత్వంలో ‘మనలో ఒక్కడు’ చేస్తూ అందులోని కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం తరువాత చేయబోయే తన తరువాతి చిత్రం ‘ధృవ’ సినిమా పైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

వివరాల్లోకి వెళితే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో పట్నాయక్ మాట్లాడుతూ ‘మనలో ఒక్కడు’ తరువాత సినిమా చేయడానికి నా దగ్గర రెండు, మూడు కథలున్నాయి. వాటిలో ఒకటి మెడికల్ మాఫియా మీద రీసెర్చ్ చేసి తయారు చేసిన కథ. నాకైతే దాన్నే నెక్స్ట్ సినిమాగా చేయాలనుంది. కానీ చరణ్ చేస్తున్న ‘ధృవ’ కూడా మెడికల్ స్కామ్ నైపథ్యంలో సాగే కథే అంటున్నారు. అందుకే ఆ సినిమా విడుదలయ్యాక దాన్ని చూసి ఆ సినిమా చేయాలా వద్దా అనేది డిసైడవుతాను అన్నారు.

 

Like us on Facebook