‘రారండోయ్ వేడుక చూద్దాం’ తాజా కలెక్షన్ల వివరాలు

‘రారండోయ్ వేడుక చూద్దాం’ తాజా కలెక్షన్ల వివరాలు

Published on May 30, 2017 3:14 PM IST


నాగచైతన్య తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం గత శుక్రవారం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. సోమవారానికి ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ .10.39 కోట్ల షేర్ ని సాధించడం విశేషం.

కాగా ఓవర్ సీస్ లో ఈచిత్రం ఆదివారం వరకు $370,566 వసూలు చేసింది. కాగా సోమవారం వివరాలు తెలియాల్సి ఉంది. ఓవర్ సీస్ లో ఈ కలెక్షన్ లను బట్టి చూస్తే హాఫ్ మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతున్నట్లు అర్థమవుతోంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా సోమవారం వరకు ఈ చిత్రం రూ. 12.75 కోట్ల షేర్ ని వసూలు చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రారండోయ్ వేడుక చూద్దాం చిత్ర 4 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా కలెక్షన్స్
నైజాం 3.70 Crs
సీడెడ్ 1.45 Crs
ఉత్తరాంధ్ర 1.56 Crs
ఈస్ట్ 0.89 Crs
వెస్ట్ 0.67 Crs
కృష్ణ 0.88 Crs
గుంటూరు
0.94 Crs
నెల్లూరు 0.30 Crs
ఏపీ మరియు తెలంగాణ 4 రోజుల కలెక్షన్లు
10.39 Crs​

సంబంధిత సమాచారం

తాజా వార్తలు