ప్రభాస్ సినిమాలో ఒకే ఒక్క ఫైట్ కోసం రూ. 30 కోట్లు ఖర్చా ?

ప్రభాస్ సినిమాలో ఒకే ఒక్క ఫైట్ కోసం రూ. 30 కోట్లు ఖర్చా ?

Published on Oct 27, 2016 1:56 PM IST

prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి 2’ పూర్తయ్యాక దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు కనువిందు చేసే అంశాలు చాలానే ఉన్నాయట. అందులో ముఖ్యమైనది యాక్షన్ సీక్వెన్స్. ఈ చిత్రంలోని ఓ ఫైట్ సన్నివేశం కోసం సుమారు రూ. 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారట. ఎందుకింత బడ్జెట్ అనుకుంటున్నారా.. ఎందుకంటే ఈ ఫైట్ రూపొందించబోయేది నేల పైనో, నీటి పైనో కాదు గాలిలో.

దీన్నే స్కై ఫైట్ అంటారట. ఈ స్కై ఫైట్ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుండి టెక్నీషియన్స్ ని రప్పించి మరీ కంపోజ్ చేస్తారట. ఒకవేళ ఈ వార్త నిజమై ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో స్కై ఫైట్ గనుక ఉంటే అభిమానులకు కనులవిందేనని చెప్పొచ్చు. ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ కు అంతర్జాతీయ మార్కెట్ బాగా పెరగడం వలన నిర్మాతలు చాలా మంది ప్రభాస్ పై భారీ బడ్జెట్ పెట్టేందుకు సుముఖంగా ఉన్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్టును యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన ప్రమోద్, వంశీ లు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు