తమిళ ‘రుద్రమదేవి’ రిలీజ్ డేట్ మారిందా.?

తమిళ ‘రుద్రమదేవి’ రిలీజ్ డేట్ మారిందా.?

Published on Oct 5, 2015 8:39 AM IST

rudramadevi
టాలీవుడ్ లో చాలా కాలం క్రితం ఆగిపోయిన పీరియాడికల్ ఫిల్మ్స్ కి మళ్ళీ ఊపిరి పోసిన సినిమాలు ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’. అందులో బాహుబలి ఇప్పటికే రిలీజ్ అయ్యింది కాబట్టి దాన్ని పక్కన పెడితే, ఇప్పడు అందరి చూపు రుద్రమదేవి పైకి షిఫ్ట్ అయ్యింది. పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. నిన్ననే ఈ చిత్ర టీం ప్రెస్ మీట్ పెట్టి మరోసారి రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు. అలాగే అన్ని భాషల్లోనూ 2డి మరియు 3డి వెర్షన్స్ రిలీజ్ అవుతాయని తెలిపారు.

అది జరిగి 12 గంటలు కూడా కాకముందే తమిళ మీడియా సర్కిల్స్ లో తమిళ వెర్షన్ ఒక వారం ఆలస్యంగా రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా మరియు తమిళ ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం తమిళ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ తెంద్రాల్ ఫిల్మ్స్ వారు అక్టోబర్ 16న రుద్రమదేవిని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ విషయంపై కచ్చితమైన ప్రకటన రాలేదు. త్వరలోనే తమిళ వెర్షన్ సమస్యని క్లియర్ చేస్తారని ఆశించవచ్చు. రుద్రమదేవిగా అనుష్క కనిపించనున్న ఈ సినిమాలో చాళుక్య వీరభద్రుడుగా రానా, గోనగన్నా రెడ్డిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమా తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు