ఉప్పెన రన్ టైం ఎంతంటే?

ఉప్పెన రన్ టైం ఎంతంటే?

Published on Jun 5, 2020 7:51 PM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ వల్ల విడుదల వాయిదాపడింది. ఒక ఈ చిత్ర నిర్మాతగా ఉన్న డైరెక్టర్ సుకుమార్ దగ్గరుండి ఎడిటింగ్ చేయించాడట. దీనితో మొత్తం 2గంటల 30నిమిషాల రన్ టైం ను ఫిక్స్ చేశారట.

ఇప్పటికే సినిమా సాంగ్స్ యూత్ బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమా అవుట్ ఫుట్ పట్ల హ్యాపీగా ఉన్న మేకర్స్ మూవీ విజయం పై విశ్వాసంతో ఉన్నారు. ఈసినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సాన వ్యవహరిస్తున్నాడు. హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా తమిళ వెర్సిటిల్ అక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. మంచి హైప్ మధ్య ఈ చిత్రం లాక్ డౌన్ అనంతరం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు