హిందీలో 150 కోట్ల మార్క్ ను దాటిన ‘సాహో’ !

హిందీలో 150 కోట్ల మార్క్ ను దాటిన ‘సాహో’ !

Published on Sep 18, 2019 12:00 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన ‘సాహో’ చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం బలమైన ఓపెనింగ్స్ సాధించింది. కాగా సాహో ఎట్టకేలకు బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ‘సాహో’ హిందీ వెర్షన్ లో బాగానే రాణించాడు. ఈ చిత్రం హిందీలో ఇప్పటివరకూ 150 కోట్ల నెట్‌ మార్క్ ను సాధించింది. పైగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా థియేటర్లలో సాహో చిత్రాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రదర్శిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

కాగా టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో మాత్రం బాక్సాఫీస్ వద్ద స్థాయికి తగ్గట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు