ఇంకొద్దిసేపట్లో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్ !

ఇంకొద్దిసేపట్లో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్న ప్రభాస్ !

Published on Apr 27, 2017 4:19 PM IST


ప్రస్తుతం తెలుగు పరిశ్రమ మొత్తం ప్రభాస్ పేరే మారుమోగిపోతోంది. అందుకు గల కారణాల్లో ఇంకొద్ది గంటల్లో విడుదలకానున్న ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం ఒకటైతే ఇంకాసేపట్లో రిలీజ్ కానున్న ప్రభాస్ తరువాతి చిత్రం ‘సాహో’ టీజర్ మరొకటి. దాదాపు ఐదేళ్లు ప్రభాస్ ను బాహుబలిగా, శివుడిగా చారిత్రక పాత్రల్లో మాత్రమే చూసిన అభిమానులు ఈరోజు సాయంత్రం అతన్నొక స్టైలిష్ లుక్ లో, సరికొత్తగా చూడబోతున్నారు.

ఈ టీజర్ సరిగ్గా సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు విడుదల కానుంది. అలాగే ఈ టీజర్ ను రేపటి నుండి బాహుబలి ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. యువ దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఒకేసారి రూపొందనున్న ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పనిచేయనుండగా బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఇహసాన్, లోయ్ లు సంగీతాన్ని ‘ఘాజి’ ఫేమ్ మది సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు