‘సాక్ష్యం’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ మారింది !

‘సాక్ష్యం’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ మారింది !

Published on Jan 16, 2018 1:06 PM IST


‘జయ జానకి నాయక’ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘సాక్ష్యం’ అనే సినిమా చేస్తున్నారు. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కతుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది.

ఈ చిత్రం యొక్క ఫాస్ట్ లుక్ ను ముందుగా ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అనుకోగా ఇప్పుడు అది కాస్త జనవరి 26 కు వాయిదాపడింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనాలు పలు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు