మెగాస్టార్ పాటల్ని రీమేక్ చేయాలనుకోలేదన్న తేజ్ !

మెగాస్టార్ పాటల్ని రీమేక్ చేయాలనుకోలేదన్న తేజ్ !

Published on Feb 21, 2017 5:10 PM IST


మెగాహీరోలు చాలా మంది చిరంజీవి మీదున్న అభిమానం, ప్రేమ కొద్ది తమ సినిమాల్లో అక్కడక్కడా ఆయన ప్రస్తావన తేవడం మామూలు విషయమే. అయితే అందరూ హీరోలకన్నా కాస్త ఎక్కువగా ధరమ్ తేజ్ తన సినిమాల్లో చిరంజీవి సినిమాల్లోని సూపర్ హిట్ పాటల్ని రీమిక్స్ చేస్తూ అభిమానులను హుషారెత్తిస్తూ ఉంటారు. అలా ఆయన ‘సుబ్రమణ్య ఫర్ సేల్’ సినిమాలో ‘గువ్వా గోరింకతో’, ‘సుప్రీం’ చిత్రంలో ‘సుప్రీం హీరో’ పాటను రీమిక్స్ చేశారు. ఇలా రీమిక్స్ చేయడం పట్ల కొన్ని సందర్భాల్లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

దాంతో తేజ్ కూడా తన గత చిత్రం ‘తిక్క’ లో ఎలాంటి పాటను రీమేక్ చేయలేదు. అలాగే ఈ నెలాఖరున విడుదలకానున్న ‘విన్నర్’ లో సైతం చిరు పాటల ప్రస్తావన తేలేదు. ఇదే విషయాన్ని తాజాగా ‘విన్నర్’ ప్రమోషన్లో భాగంగా ఫేస్ బుక్ కార్యాలయానికి వెళ్లిన తేజ్ ను అక్కడి వారు అడగ్గా ‘నేను కూడా రీమేక్ చేయాలనుకొలేదు.. దర్శకులే పట్టుబట్టి చేయించారు. ఇప్పుడైతే చేయట్లేదు లేదా ఇకపై త్వరలో చేయాలనుకొను’ అంటూ తెలివైన సమాధానం ఇచ్చాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘విన్నర్’ 24న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు