రేయ్ ఫలితంతో సంతృప్తిచెందిన సాయి ధరమ్ తేజ్

రేయ్ ఫలితంతో సంతృప్తిచెందిన సాయి ధరమ్ తేజ్

Published on Mar 28, 2015 3:54 PM IST

sai-dharam-tej
ఎన్నో అవాంతరాలను ఎదుర్కుని ఎట్టకేలకు ‘రేయ్’ నిన్న విడుదలైంది. సినిమా రిజల్ట్ పై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నా సాయి నటనపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సినిమా చూసినవారంతా ఏవి ఎలా వున్నా సాయి డ్యాన్స్ లు, ఫైట్ లు మాత్రం అద్భుతమని కితాబిస్తున్నారు. ఈ చిత్రంకోసం సాయి ఎంత కష్టపడ్డాడో తెలుస్తుందని వారి అభిప్రాయం. శ్రద్ధా దాస్ పోషించిన ప్రతినాయిక పాత్రకు సైతం విమర్శకుల ప్రశంసలు దక్కడం విశేషం.

సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వై.వి.ఎస్ చౌదరి స్వీయనిర్మాణంలో తెరకెక్కించిన విషయం తెలిసినదే. దివంగత సంగీత దర్శకుడు చక్రి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రస్తుతం సాయి హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు