కన్నడ సూపర్ హిట్ రీమేక్ లో మెగా హీరో?

కన్నడ సూపర్ హిట్ రీమేక్ లో మెగా హీరో?

Published on Feb 9, 2016 11:33 AM IST

sai-dharam-tej
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా మరో భాషలో రీమేక్ అవ్వడం చాలా కామన్ గా జరిగే విషయం. అలా ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళంలో హిట్ అయిన ‘తని ఒరువన్’ రీమేక్ లో నటించనున్నాడు. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది కాకుండా మరో రీమేక్ సినిమా కూడా రామ్ చరణ్ దగ్గరికి వచ్చింది, కానీ ఆయన అంత సముఖటగా లేకపోవడంతో యంగ్ మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ కి దక్కింది. ఇంతకీ ఏమిటా సినిమా చరణ్ ని కాదని తేజు చేతికి ఎలా వెళ్ళింది అనే విషయానికి వస్తే..

2014 చివర్లో కన్నడలో రిలీజై పెద్ద హిట్ అయిన సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’. ఈ చిత్ర కన్నడ నిర్మాతలైన జయన్న – భోగేంద్రలు చిరు ఫ్యామిలీకి బాగా సన్నిహితులు. అందుకే వీరు మొదట ఈ సినిమాని రామ్ చరణ్ తో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ చరాన్ రీమేక్ పై అనత ఆసక్తిగా లేకపోవడంతో మరో మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ దగ్గరికి వెళ్ళగా.. తనకి కథ మరియు ఒరిజినల్ వెర్షన్ నచ్చి తెలుగు రీమేక్ లో తను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తేజ్ ‘సుప్రీమ్’, ‘తిక్క’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా మొదలెట్టే అవకాశం ఉంది. అలాగే నిర్మాతలు కూడా తెలుగు రీమేక్ కోసం అన్నీ సిద్దం చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు