మెగా కుర్రాడు మంచి స్పీడుమీదున్నాడు !

saidharamtej
ఇప్పుడున్న మెగా హీరోల్లో ‘సాయి ధరమ్ తేజ్’ అందరికంటే కాస్త స్పీడుగానే ఉన్నాడు. ఈ సుప్రీం హీరో నటించిన ‘సుప్రీం’ చిత్రం ఈ మధ్యే విడుదలైన ఘనవిజయం సొంత చేసుకుంది. దాంతో తేజ్ పరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలబడిపోయాడు. నిర్మాతలు సైతం అతని కోసం క్యూ కడుతున్నారు. తేజ్ కూడా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వరుస సినిమాలకు సైన్ చేసేస్తున్నాడు.

ప్రస్తుతం ధరమ్ తేజ్ దర్శకుడు ‘సునీల్ రెడ్డి’ దర్శకత్వంలో ‘తిక్క’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 13న విడుదలకు సిద్ధమవుతోంది. అదలా ఉండగానే దర్శకుడు ‘గోపిచంద్ మల్లినేని’ దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టనున్నాడు తేజ్. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 5న మొదలుకానుంది తెలుస్తోంది. ఈ చిత్రంపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

Like us on Facebook