మెగా అభిమానులను మెప్పించడానికి సిద్ధమవుతున్న సాయి ధరమ్ తేజ్

మెగా అభిమానులను మెప్పించడానికి సిద్ధమవుతున్న సాయి ధరమ్ తేజ్

Published on Mar 27, 2015 2:09 AM IST

sai-dharam-tej
తాను నటించిన రెండవ సినిమాతోనే మంచి అభిమానగణాన్ని సంపాదించుకున్న నటుడిగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాడు. తమ వంశానికి మాత్రమే సొంతమైన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్లతో అటు చిరంజీవిని ఇటు అల్లు అర్జున్ ని జ్ఞప్తికితీసుకొచ్చాడు.

అయితే సాయి నటించిన మొదటి సినిమా ‘రేయ్’ ఎట్టకేలకు రేపు భారీ రీతిలో విడుదలకానుంది. కొన్ని ఆర్ధిక కారణాల వలన ఈ సినిమా పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. వై.వి.ఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమాలో సాయి ఒక పాప్ స్టార్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో పాటలకు సాయి నృత్య తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని సమాచారం. ఆద్యంతం ఈ చిత్రంలో మంచి ఎనర్జీ లెవల్స్ ప్రదర్శించినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో సయామీ ఖేర్ మరియు శ్రద్ధా దాస్ లు హీరోయిన్స్. ఈ చిత్రం చౌదరిగారి స్వీయ నిర్మాణంలో తెరకెక్కడం మరో విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు