పవన్ ‘గోపాల గోపాల’లో స్వామిజీగా సాయి కుమార్..?

పవన్ ‘గోపాల గోపాల’లో స్వామిజీగా సాయి కుమార్..?

Published on Aug 1, 2014 10:24 AM IST

saikumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడుగా నటిస్తున్న సినిమా ‘గోపాల గోపాల’. దేవుడిపై కేసు వేసే ఒక నాస్తికుడి పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ ‘ఓ మై గాడ్’లో కీలకమైన స్వామిజీ పాత్రలో హిందీ నటుడు మిథున్ చక్రవర్తి నటించారు. తెలుగులో కూడా ఆ పాత్రలో మిథున్ చేత నటింప చేయడానికి ప్రయత్నించారు.

మిథున్ చక్రవర్తి డేట్స్ ఖాళీ లేకపోవడం ఆ పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నారని తాజా సమాచారం. దర్శకనిర్మాతల నుండి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో ‘గోపాల గోపాల’ చిత్రీకరణ జరుగుతుంది. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. డి. సురేష్ బాబు – శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2015 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు