సాయి..నీ…లీల‌లు ప్రారంభం
Published on Apr 20, 2017 9:25 am IST


దేవుళ్ల పాత్ర‌ల్లో ఒదిగిపోయే నటులు విజ‌య్ చంద‌ర్. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో భ‌క్తి సినిమాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. క‌రుణామ‌యుడిగా.. శిరిడీసాయిబాబాగా ఆయ‌న ఆహార్యం..న‌ట‌న తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకుంది. తాజాగా ఇప్పుడు `సాయి నీ లీల‌లు` అంటూ మరోసారి అల‌రించ‌డానికి వ‌స్తున్నారు. రాధా చిత్ర ప‌తాకంపై విజ‌య్ చంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం గురువారం ఉద‌యం హైద‌రాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ లో జ‌రిగింది.

అనంత‌రం విజ‌య్ చంద‌ర్ మాట్లాడుతూ, ` ఈ చిత్రం తెర‌కెక్క‌డానికి కార‌ణం సాయి బాబానే. 35 ఏళ్ల క్రితం సాయిబాబా మ‌హ‌త్యం సినిమా చేశాం. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌కు నా పై కృప క‌ల్గింది. ఆయ‌న ఆశీర్వాదాల వ‌ల్లే మ‌ళ్లీ ఈ సినిమా చేస్తున్నాను. భ‌క్తుల కోసం ఆయ‌న బాధ్య‌త‌గా నాతో ఈ సినిమా చేయిస్తున్నారు. ఈ సినిమా టీమ్ కూడా బాబా స‌మ‌కూర్చిందే. సాయి లీల‌ల‌ను ప్రేక్ష‌కులంతా చూసి త‌రిస్తార‌ని కోరుకుంటున్నాం` అని అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` విజ‌య్ చంద‌ర్ గారు గ‌తంలో చేసిన భ‌క్తి సినిమాలు ఎంత పెద్ద హిట్ నో అంద‌రికీ తెలుసు. మ‌ళ్లీ భ‌క్తి సినిమా చేయ‌డం అదీ..బాబాగా క‌నిపించ‌డం ప్రేక్ష‌కుల‌కు కొత్త ఫీల్ ను ఇస్తుంది. ఈ చిత్రానికి యంగ్ స్టార్స్ ప‌నిచేస్తున్నారు. పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి ఆత్మీయ అతిధులుగా ఘ‌ట్ట‌మనేని ఆదిశేష‌గిరిరావు, కాజా సూర్య‌నారాయ‌ణ‌, అనుమోలు జ‌గ‌న్మోహ‌నరావు, సి.ప్ర‌భాక‌ర్, ఎస్. స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి, కె. రాజేశ్వ‌ర్‌, బి.సుబ్బారెడ్డి, చ‌ల్లా విజ‌య్, గ‌ట్టు రామ‌చంద్ర‌రావు, ఎర్ర శేష గిరిరావు, చెరుకూరి శ్రీనివాసులు, మ‌ద‌న్ లుట్త్రా, కిర‌ణ్, స‌త్య‌, శ్రీహ‌రి, వేముల కృష్ణ‌, వెంక‌టేశ్వ‌ర‌రావు, జె. శ్రీనివాస‌రెడ్డి, మంచికంటి ధ‌నుజంయ్, సి.హెచ్. బ‌స‌వ‌య్య‌, ఎల్. పార్వ‌తిదేవి, బి.వెంక‌ట‌య్య‌, సాయిరాం, వ‌డ్డేప‌ల్లి రాజేశ్వ‌ర‌రావు, జి.ఎల్.బి. శ్రీనివాస్ (డైరెక్ట‌ర్), మ‌హిమ (డెరెక్ట‌ర్), కె.ల‌క్ష్మీనారాయ‌ణ హ‌జ‌రు అయ్యారు.

 
Like us on Facebook