శేఖర్ కమ్ముల సినిమాలో తమిళ్ బ్యూటీ…!

శేఖర్ కమ్ముల సినిమాలో తమిళ్ బ్యూటీ…!

Published on May 28, 2016 6:49 PM IST

sai-pallavi
గత సంవత్సరం మళయాలం లో విడుదలైన ’ప్రేమమ్’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో లెక్చరర్ మలర్ పాత్రలో సాయిపల్లవి పోషించిన నటన ఎందరినో ఆకట్టుకుంది. నిజానికి సాయి పల్లవి తమిళ్ అమ్మాయి. ఇప్పుడు సాయిపల్లవి ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం.

మాకు లభించిన సమాచారం ప్రకారం దర్శకుడు శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ తో తీయబోయే సినిమాలో సాయి పల్లవి ని కథానాయికగా తీసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ అమెరికా లో సెటిల్ అయిన ఆంధ్రా అబ్బాయిగా నటిస్తుండగా సాయి పల్లవి తెలంగాణా అమ్మాయిగా కనిపించబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయం పై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దిల్ రాజు ఈ సినిమా ని నిర్మిస్తుండగా మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు