పూరి సినిమాని రీమేక్ చేయనున్న సల్మాన్ ఖాన్ !


స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘రోగ్’. ఈ సినిమాతో ఇషాన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పై ఒక ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. అదేమిటంటే ఈ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయనున్నాడట. అయితే అందులో హీరో సల్మాన్ కాదు సూరజ్ పంచోలి. సల్మాన్ ఈ రీమేక్ ను నిర్మిస్తాడట.

ఎప్పటి నుంచో పూరి, సల్మాన్ లు మంచి స్నేహితులు. ఆ చొరవతో పూరి ఇప్పటిదాకా తీసిన ‘రోగ్’ సినిమాని ఆయనకు చూపించాడట. సినిమా చూసిన సల్మాన్ వెంటనే ఇంప్రెస్ అయి హిందీలో సూరజ్ పంచోలితో రీమేక్ చేస్తానని అన్నాడట. పూరి కూడా ఒప్పుకోవడంతో స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయని, త్వరలోనే చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మరి సల్మాన్ అంతటి హీరో ఈ సినిమాని ఇష్టపడి, రీమేక్ చేయనున్నాడంటే అందులో గట్టి విషయముందనే అర్థం మరి.

 

Like us on Facebook