మంచి ఆరంభాన్ని పొందిన శమంతకమణి !
Published on Jul 15, 2017 2:15 pm IST


శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన శమంతకమణి చిత్రానికి మంచి ప్రారంభమే దక్కింది. ఈ చిత్రం తొలిరోజు మంచి వసూళ్లనే సాధించినట్లు తెలుస్తోంది. నలుగురు హీరోలు ఈ చిత్రంలో ఉండడం కలసి వచ్చే అంశం. సింగిల్ స్క్రీన్ మరియు మల్టి ప్లెక్స్ రెండిటిలో ఈ చిత్రానికి ఆక్యుపెన్సీ బాగా ఉన్నట్లు తెలుస్తోంది.

క్రిటిక్స్ నుంచి కూడా ఈచిత్రానికి మంచి రివ్యూ లు అందాయి. ముఖ్యంగా ఏ చిత్రం లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. ప్రతిభగల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నాడు. నలుగురు హీరోలను అతడు హ్యాండిల్ చేసిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి. సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది మరియు సుధీర్ బాబు ఈ చిత్రం లో ప్రధాన పాత్రల్లో నటించారు.

 
Like us on Facebook