నిర్మాతగా సమంత..!

నిర్మాతగా సమంత..!

Published on Oct 20, 2014 12:30 PM IST

samantha-1
వరుస విజయాలతో తెలుగులో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత త్వరలో నిర్మాతగా మారనుంది. ‘కొంచం టచ్ లో ఉంటె చెప్తా’ కార్యక్రమంలో ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది. ‘సినిమా నిర్మాణం అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్ గా రిటైర్ అయిన తర్వాత భవిష్యత్ లో సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. అని చెప్పింది. అంతే కాదు, మరో మూడేళ్ళ తర్వాత నటనకు స్వస్తి పలికి పెళ్లి చేసుకుంటాను. అని క్లారిటీ ఇచ్చింది.

లేటు వయసులో పెళ్లి చేసుకుంటే, పిల్లలు లేటుగా పుడతారు. వారు పెరిగి పెద్దయ్యే సరికి నాకు వయసైపోతుంది. నాకు 60 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి, నా పిల్లలు 15 ఏళ్ల వయసులో ఉంటె ఏం లాభం. వారితో నేను ఆడుకోలేను. అందుకే 30 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం ఒక వ్యక్తితో రెండేళ్ళ నుండి ప్రేమలో ఉన్నాను. మరో మూడేళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటాను. అని జీవితంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

సమంత మాటలు విన్న వారు ఆశ్చర్యపోయారు. ప్రతి విషయంలో వాస్తవానికి చాలా దగ్గరగా ఆలోచిస్తుంది. తెలివైన అమ్మాయి. తన జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకుంటుంది. అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు