‘యూ టర్న్’ షూటింగ్ బిజీ లో సమంత !
Published on May 16, 2018 4:59 pm IST

‘రంగస్థలం,మహానటి ‘సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ‘అక్కినేని సమంత’నటిస్తున్న తాజాచిత్రం యూటర్న్.తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కన్నడలో విడుదలై ఘన విజయం సాధించిన ‘యూ టర్న్’ చిత్రానికి రీమేక్ .ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం సమంత ఈ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నారు.ఈ చిత్రానికి సంబదించిన ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.’యూ టర్న్’ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో సీనియర్ నటి ‘భూమిక’ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

 
Like us on Facebook