థ్రిల్లర్ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటున్న “సమంత” డైరెక్టర్.!

థ్రిల్లర్ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటున్న “సమంత” డైరెక్టర్.!

Published on Mar 9, 2021 4:00 PM IST

ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి ‘షార్ట్ ఫిల్మ్స్’ మంచి షార్ట్ కట్స్ గా మారాయి. షార్ట్ ఫిల్మ్స్ తో తమ టాలెంట్ తాలూకు స్పార్క్ చూపించుకుని… డైరెక్ట్ గా మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్స్ అయిపోతున్నారు కొందరు కుర్రాళ్ళు. ఆ కోవలో తాజాగా చేరాడు ముఖేశ్ కుమార్.అనంతపురం జిల్లాలోని ‘కదిరి’కి చెందిన ముఖేష్ కుమార్… సినిమాల పట్ల ప్యాషన్ తో… లక్షల వేతనమిచ్చే సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని… పలు షార్ట్ ఫిల్మ్స్ తో… సినిమా మేకింగ్ పై పట్టు సాధించి… ‘సమంత’ పేరుతో ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించాడు. ఊర్వశి ఓటిటి ద్వారా ఈనెల 6న విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వస్తోంది.

హిప్నాటిజం నేపథ్యంలో… హీరోయిన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం “సమంత”. బహు భాషా ప్రవీణుడు-ఎమ్.ఎస్.సి గోల్డ్ మెడలిస్ట్ ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సిరి కనకన్ అనే ముద్దుగుమ్మ టైటిల్ రోల్ పోషించగా… లిరిన్, రమేష్ నీల్, చరణ్, శ్రీకాంత్, పృథ్వి కీలక పాత్రలు పోషించారు.తన తొలి చిత్రం “సమంత” చిత్రానికి వస్తున్న స్పందనపై బహుభాషా ప్రవీణుడు-బహుముఖ ప్రతిభాశాలి ముఖేష్ కుమార్ మాట్లాడుతూ…”బాహుబలి’ రిలీజ్ అయినప్పుడు నేను దుబాయ్ లో జాబ్ చేస్తున్నాను.

ఆ సినిమా చూశాక, ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకున్నది విన్నాక… సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. పరుచూరి గోపాలకృష్ణగారి క్లాసులకు ఫిల్మ్ ఛాంబర్ లో హాజరైనప్పుడు… గెస్ట్ గా వచ్చిన విజయేంద్రప్రసాద్ గారిని అందరూ దిగ్గున లేచి రిసీవ్ చేసుకోవడం ప్రత్యక్షంగా చూశాక… రైటర్ సక్సెస్ అయితే ఇంత గౌరవం దక్కుతుందన్నమాట అనుకుని… స్క్రిప్ట్ లు రాయడం మొదలు పెట్టాను. ఆర్జీవి, మిస్కిన్ నా ఫేవరేట్ డైరెక్టర్స్.

వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో.. క్రైమ్/కామెడీ/సస్పెన్స్/హారర్ థ్రిల్లర్స్ తీయాలని, థ్రిల్లర్స్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలన్నది నా కోరిక. “సమంత” చిత్రానికి వస్తున్న స్పందన చాలా స్ఫూర్తినిస్తోంది. ఒకేసారి పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం రావడం కష్టం కాబట్టి… ముందు ఒకటి రెండు మీడియం బడ్జెట్ సినిమాలతో… నా ప్రతిభను ప్రూవ్ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాను. అందుకోసం స్క్రిప్ట్ లు సిద్ధం చేసుకుంటున్నాను” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు