‘బెంగళూర్ డేస్’ రీమేక్‌లో సమంత!

‘బెంగళూర్ డేస్’ రీమేక్‌లో సమంత!

Published on Jul 30, 2015 8:07 PM IST

SAMANTHA
మళయాలంలో ఘన విజయం సాధించిన ‘బెంగళూరు డేస్’ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. తమిళంలో ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మిస్తుండగా, తెలుగులో దిల్‌రాజు నిర్మించనున్నారు. ఇప్పటికే తమిళ రీమేక్ మొదలవ్వడమే కాక, శరవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. తెలుగు రీమేక్ ఇంకా మొదలుకావాల్సి ఉంది. ఇక తమిళ రీమేక్‌లో ఆర్య, రానా, బాబీ సింహా, శ్రీ దివ్యలు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ తారల లిస్ట్‌లోకి సమంత వచ్చి చేరనున్నట్లు తెలుస్తోంది. మళయాలంలో నిత్యామీనన్ పోషించిన అతిథి పాత్రను సమంత చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఆమెను సంప్రదించారట. ఇక ఈ సినిమాలో నటించేందుకు సమంత కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
‘ఓకే బంగారం’తో తెలుగు తెరకు పరిచయం అయిన దుల్కర్ సల్మాన్‌తో పాటు నివిన్, నాజ్రియా తదితరులు నటించిన ‘బెంగళూర్ డేస్’ ఒరిజినల్‌కు అంజలి మీనన్ దర్శకత్వం వహించారు. నిత్యా మీనన్ సినిమాను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు ఆ పాత్రను సమంత చేయనుండడం విశేషం!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు