5 ఏళ్ళ కెరీర్లో సమంత ఫస్ట్ డ్యూయల్ రోల్

5 ఏళ్ళ కెరీర్లో సమంత ఫస్ట్ డ్యూయల్ రోల్

Published on Apr 21, 2015 11:03 AM IST

Samantha
తమిళ ముద్దుగుమ్మ సమంత తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. చియాన్ విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా ’10 ఎంద్రాకుల్ల’. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిన విషయమే..ఈ సినిమాలో సమంత డేర్ డెవిల్ స్టంట్స్ కూడా చేయనుందనే విషయాన్ని ఇదివరకే తెలియజేశాము. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సమంత గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెబుతాం.

5 ఏళ్ళ కెరీర్లో సమంత మొదటి సారిగా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం మీడియాలో సంచరిస్తున్న వార్తల ప్రకారం సమంత డ్యూయల్ రోల్ చెయ్యడమే కాకుండా అందులో ఓ పాత్రలో నేపాలీ అమ్మాయిగా కూడా కనిపించనుంది. ఇప్పటికే సమంత ఇచ్చిన పలు ఇంటర్వ్యూస్ లో కూడా 10 ఎంద్రాకుల్ల చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని, అలాగే అదొక డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పింది. ఒక రోడ్ జర్నీ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాలో ఛార్మీ ఓ కీలక పాత్ర చేసింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సమ్మర్ చివర్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు