హిందువుగా మారిపోయిన సమంత..!?

samantha-naga-chatanya

అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైతన్య చాలాకాలంగా హీరోయిన్ సమంతతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమంత కూడా అక్కినేని కుటుంబంతో కలిసిపోయి వారితో కుటుంబ సభ్యురాలిలాగే పార్టీలకు, ఫంక్షన్‌లకు హాజరవుతూ వస్తున్నారు. నాగార్జున కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో వచ్చే ఏడాది వీరిద్దరి పెళ్ళి జరగనుంది. ఇక ఇదిలా ఉంటే చైతన్య – సమంతల పెళ్ళి ఏ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందని ఇప్పట్నుంచే ప్రచారం మొదలైంది.

క్రిస్టియన్ అయిన సమంత, హిందువు అయిన నాగ చైతన్య ఈ ఇద్దరి పెళ్ళి రెండు సాంప్రాదాయాల ప్రకారం జరగనుందని వినిపించగా, తాజాగా నాగార్జున, నాగ చైతన్య, సమంతలు కలిసి చేసిన ఓ పూజ ఆసక్తికరంగా మారింది. సమంతను హిందు మతంలోకి మార్పిడి చేస్తూ జరిగిన పూజా కార్యక్రమమే ఇదని వినిపిస్తోంది. అయితే ఈ విషయమై అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన ఏదీ రాలేదు. ఇద్దరూ తమ తమ కెరీర్స్ పరంగా మంచి సినిమాలు చేస్తూ ఉండడంతో వచ్చే ఏడాది వరకూ పెళ్ళిని వాయిదా వేసుకున్నారు.

 

Like us on Facebook