తల్లి అయిన నటి సమీరా రెడ్డి

తల్లి అయిన నటి సమీరా రెడ్డి

Published on May 26, 2015 12:09 PM IST

Sameera_Reddy
తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డి, ముంబైలోని ఓ హాస్పిటల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్షయ్ వర్ధే అనే వ్యాపారవేత్తను 2014లో ఆమె పెళ్ళాడిన విషయం తెలిసిందే. ఈ జంట జీవితంలోకి ఇప్పుడు మరో కొత్త వ్యక్తి రావడంతో సమీరా రెడ్డి కుటుంబమంతా సంబరాల్లో మునిగిపోయింది.

‘అశోక్’, ‘జై చిరంజీవ’ వంటి సినిమాలతో మెప్పించిన సమీరా, ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో భళ్ళారి బావ అనే పాట ద్వారా ఆమె చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం సమీరా రెడ్డి, బేబీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తమ జీవితంలో ఓ ప్రత్యేక వ్యక్తికి ఆహ్వానం పలికి కొత్త అనుభూతులు పొందేందుకు సిద్ధమైన సమీరా రెడ్డికి 123తెలుగు తరపున శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు