వాయిదా పడిన ‘సామీ స్క్వేర్’ తెలుగు మోషన్ పోస్టర్ విడుదల !

వాయిదా పడిన ‘సామీ స్క్వేర్’ తెలుగు మోషన్ పోస్టర్ విడుదల !

Published on May 20, 2018 4:24 PM IST

హీరో చియాన్ విక్రమ్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సామీ స్క్వేర్.ఈ చిత్ర తమిళ మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఈ రోజు ఈ చిత్ర తెలుగు మోషన్ పోస్టర్ రిలీజ్ అవ్వాల్సివుండగా అనివార్య కారణాల వల్ల ఈ నెల 23 వ తేదీ సాయత్రం 6:00 గంటలకి రిలీజ్ అవుతుందని కొద్దీ సేపటిక్రితం చిత్ర యూనిట్ ప్రకటించింది.

తమిళ భాషలో నిర్మిస్తున్నఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు.’సింగం’ మూవీ సిరీస్ కి దర్శకత్వం వహించిన హరి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి. తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబు తమీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు