‘బెంగాల్ టైగర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమా : సంపత్ నంది

‘బెంగాల్ టైగర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమా : సంపత్ నంది

Published on Dec 1, 2015 11:46 AM IST

sampath-nandi
‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, ప్రస్తుతం రవితేజతో ‘బెంగాల్ టైగర్’ అన్న సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. రవితేజ స్టైల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 10న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ నేపథ్యంలోనే ‘బెంగాల్ టైగర్’ యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నిన్న హైద్రాబాద్‌లో ‘బెంగాల్ టైగర్’ ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో రవితేజతో పాటు ఇతర ముఖ్య తారాగణమంతా పాల్గొని సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. “నా కెరీర్ అస్తవ్యస్థమైన ఈ సమయంలో రవితేజ గారు మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చి ప్రోత్సాహించారు. బెంగాల్ టైగర్ అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా. ఈ నెలాఖర్లో క్రిస్‌మస్ పండగ, వచ్చే నెలలో సంక్రాంతి.. ఇలా అన్ని పండగల కంటే ముందే వస్తోన్న మన పండగే ‘బెంగాల్ టైగర్’. బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమాగా బెంగాల్ టైగర్ నిలుస్తుందన్న నమ్మకం ఉంది” అని తెలిపారు. రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు