పవన్ కళ్యాణ్‍ను వదిలిపెట్టని సంపత్ నంది!?

sampath-nandi
‘ఏమైంది ఈ వేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది, అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకొని, ఆ వెంటనే జారవిడుచుకున్నారు. కారణాలేమైనా సంపత్ నంది, పవన్ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్ళేంతవరకూ వచ్చి ఆగిపోయింది. అయినప్పటికీ సంపత్ నంది పవన్‍పై తనకున్న ఇష్టాన్ని ఏదో రకంగా చాటుతూనే ఉన్నారు. రవితేజతో తీసిన సినిమాకు ‘బెంగాల్ టైగర్’ అన్న పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్‌ను టైటిల్‌గా పెట్టుకున్నారు.

తాజాగా ఇప్పుడు ఆయన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ బ్లాక్‍బస్టర్ ‘అత్తారింటికి దారేదీ’లోని పాటైన ‘ఆరడుగుల బుల్లెట్’ అని పెడదామనుకుంటున్నారట. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమాకు ఈ పేరైతేనా బాగుంటుందని టీమ్ భావిస్తోందట. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తోన్న ఈ సినిమా ఈమధ్యే బ్యాంకాక్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

Bookmark and Share