మురుగదాస్ సినిమాలో సంపూర్నేష్ బాబు

మురుగదాస్ సినిమాలో సంపూర్నేష్ బాబు

Published on Jan 28, 2015 8:39 PM IST

sampurnesh
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు క్రేజ్ కోలీవుడ్ వరకు పాకింది. ఎంతెలా అంటే.. ప్రముఖ దర్శకుడు ఎఆర్ మురుగదాస్, పిలిచి మరి తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో మురుగదాస్ నిర్మిస్తున్న సినిమా ’10 ఎండ్రదుకుల్లా’ సినిమాలో సంపూర్నేష్ బాబు నటిస్తున్నాడని సమాచారం. తమిళంలో ఓ ప్రముఖ కమెడియన్ చేస్తున్న పాత్రను తెలుగులో సంపూ చేస్తున్నాడట. విక్రమ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి నిర్మాత మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నారు.

‘హృదయ కాలేయం’ సినిమాతో సంపూ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. తర్వాత ‘కరెంటు తీగ’లో అతిధి పాత్రలో సందడి చేశాడు. త్వరలో విడుదలవుతున్న అల్లరి నరేష్ ‘బందిపోటు’లో కీలక పాత్రలో నటించాడు. హీరోగా రెండు సినిమాలను సెట్స్ ఉంచాడు. మంచు విష్ణు నిర్మాణంలో రూపొందుతున్న ‘సింగం 123’ మరియు ‘కొబ్బరి మట్ట’ సినిమాలలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు