బొబ్బిలి లో సందీప్ కిషన్ ‘టైగర్’

బొబ్బిలి లో సందీప్ కిషన్ ‘టైగర్’

Published on Dec 20, 2014 9:09 AM IST

sandeep-kishan (1)
జోరుగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న యువ నటులలో ముందుండే హీరో సందీప్ కిషన్. తన చిత్రాలని ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటూ చిత్రానికి చిత్రానికి మధ్య గ్యాప్ లేకుండా ఫోకస్ పెడుతున్నాడు. తన తాజా చిత్రం ‘బీరువా’ షూటింగ్ పుర్తి చూసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. ఇదిలావుండగా వెంటనే ‘టైగర్’ అనే చిత్రం షూటింగ్ ప్రారంభించాడు.

ప్రస్తుతం బొబ్బిలి లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఎ. ఆర్. మురగాదాస్ గైడ్ చేస్తున్న ఈ చిత్రానికి వి. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. టాగోర్ మధు యెన్. వి . ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు