సందీప్ కిషన్ కొత్త సినిమా విడుదల తేది ఖరారు !

సందీప్ కిషన్ కొత్త సినిమా విడుదల తేది ఖరారు !

Published on Dec 12, 2017 12:50 PM IST

మహేష్ బాబు సోదరి మంజుల ద‌ర్శ‌కత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘మనసుకు నచ్చింది’. అమైరా దస్తూర్, త్రిధా చౌద‌రి హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజ‌ర్‌ ను కృష్ణ ఈరోజు విడుదల చేసారు. ‘ఫాలో యువర్ హార్ట్’ అనే ట్యాగ్‌లైన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.

ఈ సినిమాను జనవరి 26 న విడుదల చెయ్యబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలో జెమిని కిరణ్ మరియు ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థలో ఇందిరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలకు సంగీతం అందించిన రతన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు