సరిలేరూ నీకెవ్వరూ మూవీ టీజర్ ముహూర్తం ఆరోజేనా…?

సరిలేరూ నీకెవ్వరూ మూవీ టీజర్ ముహూర్తం ఆరోజేనా…?

Published on Nov 18, 2019 9:34 AM IST

మహేష్ బాబు సంక్రాంతి మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బ్రహ్మోతవం, స్పైడర్ చిత్రాలు మహేష్ కి షాక్ ఇచ్చాయి. ఐతే కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను చిత్రంతో మహేష్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ మహర్షి కూడా హిట్ వెంచర్ గా నిలిచింది. నైజాం లో ఐతే మహర్షి 30కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. దీనితో తాజా చిత్రం సరిలేరూ నీకెవ్వరూ చిత్రం కూడా భారీ విజయం అందుకోనుందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కాగా కొద్దిరోజుల క్రితం దర్శకుడు ఈ మూవీ టీజర్ పై హింట్ ఇచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ సరిలేరూ నీకెవ్వరూ చిత్ర టీజర్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈనెల 23న దర్శకుడు అనిల్ రావిపూడి జన్మదినాన్ని పురస్కరించుకొని టీజర్ విడుదల చేసే అవకాశం కలదు. ఇక సరిలేరూ నీకెవ్వరూ మూవీలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, విజయ శాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు